Published on Oct 7, 2026 12:04 AM IST
విలక్షణ నటి పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన తాజా మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ప్రథమ దృష్ట్యా కుట్రక్కార్’ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టేందుకు ముస్తాబైంది. ఓనమ్ సందర్భంగా సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. థియేట్రికల్ రన్ ముగియడంతో ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 9 నుంచి ఈ చిత్రాన్ని తమ వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు సహా ఇతర ప్రధాన భాషల ఆడియోలతోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుండటం విశేషం.
ఈ చిత్రానికి షహద్ నిలంబూర్ దర్శకత్వం వహించారు. ఇందులో పార్వతితో పాటు మాథ్యూ థామస్, విజయరాఘవన్, సిద్ధార్థ్ భరతన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 11 ఐకాన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ సెల్వ ఈ చిత్రాన్ని నిర్మించగా, ముజీబ్ మజీద్ సంగీతం అందించారు. థియేటర్లలో చూడలేకపోయిన క్రైమ్ థ్రిల్లర్ ప్రియులు అక్టోబర్ 9 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామాను వీక్షించవచ్చు.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | Crime Drama Pradhama Drishtiya Kuttakkar Locks OTT Release Date – Here’s When and Where to Watch It | 0 | 10 | 06-10-2026 |
| 2 | Naga Vamsi’s Epic Gets Its OTT Release Date; Netflix Confirms Multilingual Release | 0 | 8.4 | 06-10-2026 |
| 3 | Maremma: Ravi Teja’s Nephew Maadhav Bhupathiraju’s Film Locks OTT Date | 0 | 10 | 06-10-2026 |
| 4 | The Paradise: Has Nani’s Film Locked Its OTT Release Date? | 0 | 10 | 07-10-2026 |
| 5 | The Traitors Telugu trailer: Teja Sajja sets the tone for a thrilling game | 0 | 8.52 | 06-10-2026 |
| 6 | Vimeo OTT: What's new in H1 2026 | 0 | 7.04 | 07-08-2026 |
| 7 | ❗ ПРЕМЬЕРА ❗ «Жeнcκий οтдeл» - Новый сериал смотрите в ... | 0 | 6.94 | 30-09-2026 |
| 8 | ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎందులో అంటే! | 0 | 10 | 06-10-2026 |
| 9 | Понять и простить: драмтеатр представил спектакль «Похороните меня за плинтусом» | 0 | 6.69 | 28-09-2026 |
| 10 | Video : Saripoyaru Iddaroo Teaser (Meghamsh Srihari, Yashwin Vegesna) | 0 | 10 | 06-10-2026 |